Breaking News
Loading...

Random Post

Recent Post

Thursday, 27 August 2015
WHAT A IDEA?

WHAT A IDEA?


రండి చదువుకోండి:
గ్రంధాలయానికో పుస్తకాల దుకాణానికో పని గట్టుకొని వెళ్ళాలంటే బద్దకించే వారు కూడా బస్టాప్లో బస్సు కోసం ఎదురుచూస్తున్నపుడు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినపుడు ఎదురుగా పుస్తకాలు కనిపిస్తే అటువైపు వెళ్లకుండా ఉండలేరు.చైనా నాంజింగ్లో రోడ్డు పక్కన ఏర్పాటుచేసినా పుస్తక ప్రదర్శన కూడా అందుకే సందర్శకులను విషేషంగా ఆకర్శిస్తోంది.వెళ్లిన సందర్సకులు తమకు నచ్చిన పుస్తకాలను కాసేపు చదువుకుని వెళ్లిపోవచ్చు.లేదా తాము చదివిందానికి సంతృప్తిచెంది,ఇలాంటి ప్రదర్సనలను ప్రోత్సహించాలనుకునే వాళ్లు తమకు తోచిన మొత్తాన్ని అక్కడున్న క్యాష్ బాక్సులో వేయవచ్చు.పుస్తక ప్రియుల మీద నమ్మకంతోనే నిర్వహకులు ఉద్యోగాల పర్యవేక్షణలేని ఈ సరికొత్త ప్రయోగం చేసారట.వాళ్ల నమ్మకమే నిజమై ఇప్పటివరకు ఒక్క పుస్తకం కూడా మాయం కాకపోవడమే కాకుండా ప్రదర్శన  ఏర్పాటు చేయడానికి ఖర్చు పెట్టిన మొత్తం తిరిగి వచ్చేసిందటా.

Life of eagle

Life of eagle


గ్రద్ద జీవితకాలం 70 ఏళ్లు.తమ జాతి పక్షుల్లో అతి ఎక్కువ జీవితకాలం గ్రద్దదే.అయితే 40 ఏళ్లు పూర్తి అయ్యేసరికి.. బాగా పొడవుగా పెరిగిన గోళ్లు..ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు.పొడవైన దాని ముక్కు కొన చివర వొంగి పోయి..పట్టుకున్న ఆహారాన్ని ఛేదించి,నోటితో స్వీకరించడానికి సహకరించదు.ఈకలు దట్టంగా పెరిగిన దాని రెక్కలు బరువై..చురుకుగా ఎగరడానికి సహకరించవు.ఆ వయసులో దాని ముందున్నవి రెండే మార్గాలు..ఒకటి ఆహారన్ని సపాదించుకోలేక సుష్కించి మరణిచడం.రెండోది,బాధాకరమైనదైనా తనను తాను మార్చుకోవడం.గ్రద్ద రెండో మార్గాన్నే ఎంచుకుంటుంది.ఈ మార్పు దాదాపు 150 రోజుల ప్రక్రియ.ఈ మార్పు కోసం గ్రద్ద అందుబాటులో ఉన్న శిఖరాగ్రంపై కూర్చోని..పెరిగి పోయిన తన ముక్కుకొనను..కాలిగోళ్ల మధ్య పెట్టుకొని ఎంతో భాద కలిగినా,నెమ్మదిగా వొలిచేసుకుంటుంది.ఊడ గొట్టుకున్నచోట తన ముక్కు పదునుగా కొత్తగా పెరిగే వరకు ఎదురుచూస్తుంది.పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్లను ఊడపెరుక్కుంటుంది.కొత్త గోళ్లు పెరిగిన తర్వాత..వాటి సాయంతో తన పాత ఈకలను పీకెస్తుంది.అలా బరువుగా ఉన్న తన రెక్క్లలను తేలికగా మార్చుకుంటుంది.ఇలా 5 నెలల బాదాకరమైనా పరిశ్రమ, కృషితో సాధించుకున్న పునర్జన్మతో మరో 30 ఏళ్లు హాయిగా జీవిస్తుంది. సృష్టిలో మనగలగడానికి మార్పు అత్యవసరం..అనే జీవిత సత్యాన్ని గ్రద్ద జీవించి,మనల్ని కూడా అలా జీవించమని భోదిస్తుంది. 

apj abdul kalam

apj abdul kalam


అబ్దుల్ కలాం:
ఏ రంగములో పనిచేసినా సాటివారిలో స్పూర్తిని కలింగించడం కలాం ప్రత్యేకత.ముఖ్యంగా "కలలు కనండి-
ఆ కలలు సాకారానికి కృషి చేయండి'' అంటూ యువతను వెన్నుతట్టి ప్రోత్సహించారు.బాల్యములో వార్తాపత్రికలు అమ్మిన కలాం స్వయంకృషితో ఎదిగి రాష్ట్రపతి పదివి అధిష్టించారు.స్వప్నాలను సాకారం చేసుకోవడానికి నిదర్శనంగా నిలిచారు. ఒక పేద ముస్లిం కుటుంబములో జన్మించిన కలాం ప్రముఖ శాస్త్రవేత్తగా ఎదిగి అనంతరం దేశ ప్రథమ పౌరిడిగా పనిచేసారు.అగ్రదేశాలకు ధీటుగా క్షిపణి రంగములో అద్భుతమైన క్షిపణులు రూపొందిచారు.అణు ప్రయోగాల పరీక్షల నుంచి ఉపగ్రహ వాహక నౌకల రూపకల్పన వరకు భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.

ఉద్యోగ వివరాలు:
తొలి ఉద్యోగం: బెంగుళూరులోని DRDOలో జూనియర్ శాస్త్రవేత్త.
పనితీరు : visitingprofesorగా కూడ సేవలందించిన కలాంగారు ప్రధానమంత్రి శాస్త్ర సాంకేతిక ప్రధాన సలహదారుడిగా,DRDO కార్యదర్శిగా,DRDL  డైరెక్టరుగా కూడా పనిచేసారు.

సాధించిన విజయాలు:
దేశ ఉపగ్రహ కార్యక్రమాలు,గైడెడ్,బాలిస్టిక్ క్షిపణుల ప్రాజెక్టులు,అణ్వాయుధ విజయాలు సాధించారు.
అగ్ని,నాగ్,పృథ్వి,త్రిశూల్ క్షిపణులు ఆయన కృషికి నిదర్శనం.

రాజ్యాంగ హోద:
రాష్ట్రపతి:భారతదేశ 11వ రాష్ట్రపతిగా పదవి నిర్వహించారు.
రాష్ట్రపతిగా ఉన్నప్పుడు : భారతదేశ తొలి బ్రహ్మచారి రాష్ట్రపతిగా,సియాచిణ్ నియంత్రణ రేఖను సందర్శించిన తొలి రాష్ట్రపతిగా,సుఖోయ్ ఫైటర్ జెట్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా,జలాంతర్గామిలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా,భారత science కాంగ్రేస్ లో ప్రసంగిచిన తొలి రాష్ట్రపతిగా కలాంగారు చరిత్ర సృష్టించారు. 

వ్యక్తిగత వివరాలు:
పూర్తి పేరు       :అవుల్ పకీర్ జైనులబ్దీణ్ అబ్దుల్ కలాం
జననం            :1931,అక్టోబర్ 15,రామేశ్వరం
అస్తమయం      :2015,జులై 27
తల్లి దండ్రులు   :హాజీ అమ్మళ్, జైనులబ్దీణ్
విద్యాభ్యాసము  : ప్రాథమిక విద్య -రామేశ్వరం
                          డిగ్రీ-సెయింట్ జోసెఫ్ కళాశాల,తిరుచిరాపల్లి.
                          ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్-మద్రాస్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.

Thursday, 6 August 2015
SREEMANTUDU

SREEMANTUDU

FRIDAY RELEASE ON YOUR THEATRES
WATCH MOVIE RATINGS DONT MISS FROM IRANISPOT

Back To Top