apj abdul kalam
అబ్దుల్ కలాం:
ఏ రంగములో పనిచేసినా సాటివారిలో
స్పూర్తిని కలింగించడం కలాం ప్రత్యేకత.ముఖ్యంగా "కలలు కనండి-
ఆ కలలు సాకారానికి కృషి చేయండి''
అంటూ యువతను వెన్నుతట్టి ప్రోత్సహించారు.బాల్యములో వార్తాపత్రికలు అమ్మిన కలాం స్వయంకృషితో
ఎదిగి రాష్ట్రపతి పదివి అధిష్టించారు.స్వప్నాలను సాకారం చేసుకోవడానికి నిదర్శనంగా నిలిచారు. ఒక పేద ముస్లిం కుటుంబములో జన్మించిన
కలాం ప్రముఖ శాస్త్రవేత్తగా ఎదిగి అనంతరం దేశ ప్రథమ పౌరిడిగా పనిచేసారు.అగ్రదేశాలకు
ధీటుగా క్షిపణి రంగములో అద్భుతమైన క్షిపణులు రూపొందిచారు.అణు ప్రయోగాల పరీక్షల నుంచి
ఉపగ్రహ వాహక నౌకల రూపకల్పన వరకు భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.
ఉద్యోగ వివరాలు:
తొలి ఉద్యోగం: బెంగుళూరులోని DRDOలో జూనియర్ శాస్త్రవేత్త.
పనితీరు : visitingprofesorగా కూడ సేవలందించిన కలాంగారు ప్రధానమంత్రి శాస్త్ర సాంకేతిక ప్రధాన సలహదారుడిగా,DRDO కార్యదర్శిగా,DRDL డైరెక్టరుగా కూడా పనిచేసారు.
సాధించిన విజయాలు:
దేశ ఉపగ్రహ కార్యక్రమాలు,గైడెడ్,బాలిస్టిక్ క్షిపణుల ప్రాజెక్టులు,అణ్వాయుధ విజయాలు సాధించారు.
అగ్ని,నాగ్,పృథ్వి,త్రిశూల్ క్షిపణులు ఆయన కృషికి నిదర్శనం.
రాజ్యాంగ
హోద:
రాష్ట్రపతి:భారతదేశ 11వ రాష్ట్రపతిగా పదవి నిర్వహించారు.
రాష్ట్రపతిగా ఉన్నప్పుడు : భారతదేశ
తొలి బ్రహ్మచారి రాష్ట్రపతిగా,సియాచిణ్ నియంత్రణ రేఖను సందర్శించిన తొలి రాష్ట్రపతిగా,సుఖోయ్
ఫైటర్ జెట్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా,జలాంతర్గామిలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా,భారత
science కాంగ్రేస్ లో ప్రసంగిచిన తొలి రాష్ట్రపతిగా కలాంగారు చరిత్ర సృష్టించారు.
వ్యక్తిగత వివరాలు:
పూర్తి పేరు
:అవుల్ పకీర్ జైనులబ్దీణ్ అబ్దుల్ కలాం
జననం :1931,అక్టోబర్ 15,రామేశ్వరం
అస్తమయం
:2015,జులై 27
తల్లి దండ్రులు
:హాజీ అమ్మళ్, జైనులబ్దీణ్
విద్యాభ్యాసము
: ప్రాథమిక విద్య -రామేశ్వరం
డిగ్రీ-సెయింట్ జోసెఫ్ కళాశాల,తిరుచిరాపల్లి.
ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్-మద్రాస్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.

0 comments :
Post a Comment