Life of eagle
గ్రద్ద
జీవితకాలం 70 ఏళ్లు.తమ జాతి పక్షుల్లో అతి ఎక్కువ జీవితకాలం గ్రద్దదే.అయితే 40 ఏళ్లు
పూర్తి అయ్యేసరికి.. బాగా పొడవుగా పెరిగిన గోళ్లు..ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు.పొడవైన
దాని ముక్కు కొన చివర వొంగి పోయి..పట్టుకున్న ఆహారాన్ని ఛేదించి,నోటితో స్వీకరించడానికి
సహకరించదు.ఈకలు దట్టంగా పెరిగిన దాని రెక్కలు బరువై..చురుకుగా ఎగరడానికి సహకరించవు.ఆ
వయసులో దాని ముందున్నవి రెండే మార్గాలు..ఒకటి ఆహారన్ని సపాదించుకోలేక సుష్కించి మరణిచడం.రెండోది,బాధాకరమైనదైనా
తనను తాను మార్చుకోవడం.గ్రద్ద రెండో మార్గాన్నే ఎంచుకుంటుంది.ఈ మార్పు దాదాపు 150 రోజుల
ప్రక్రియ.ఈ మార్పు కోసం గ్రద్ద అందుబాటులో ఉన్న శిఖరాగ్రంపై కూర్చోని..పెరిగి పోయిన
తన ముక్కుకొనను..కాలిగోళ్ల మధ్య పెట్టుకొని ఎంతో భాద కలిగినా,నెమ్మదిగా వొలిచేసుకుంటుంది.ఊడ
గొట్టుకున్నచోట తన ముక్కు పదునుగా కొత్తగా పెరిగే వరకు ఎదురుచూస్తుంది.పదునుగా పెరిగిన
కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్లను ఊడపెరుక్కుంటుంది.కొత్త గోళ్లు
పెరిగిన తర్వాత..వాటి సాయంతో తన పాత ఈకలను పీకెస్తుంది.అలా బరువుగా ఉన్న తన రెక్క్లలను
తేలికగా మార్చుకుంటుంది.ఇలా 5 నెలల బాదాకరమైనా పరిశ్రమ, కృషితో సాధించుకున్న పునర్జన్మతో
మరో 30 ఏళ్లు హాయిగా జీవిస్తుంది. సృష్టిలో మనగలగడానికి మార్పు అత్యవసరం..అనే జీవిత
సత్యాన్ని గ్రద్ద జీవించి,మనల్ని కూడా అలా జీవించమని భోదిస్తుంది.

0 comments :
Post a Comment