WHAT A IDEA?
రండి చదువుకోండి:
గ్రంధాలయానికో
పుస్తకాల దుకాణానికో పని గట్టుకొని వెళ్ళాలంటే బద్దకించే వారు కూడా బస్టాప్లో బస్సు
కోసం ఎదురుచూస్తున్నపుడు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినపుడు ఎదురుగా పుస్తకాలు కనిపిస్తే
అటువైపు వెళ్లకుండా ఉండలేరు.చైనా నాంజింగ్లో రోడ్డు పక్కన ఏర్పాటుచేసినా పుస్తక ప్రదర్శన
కూడా అందుకే సందర్శకులను విషేషంగా ఆకర్శిస్తోంది.వెళ్లిన సందర్సకులు తమకు నచ్చిన పుస్తకాలను
కాసేపు చదువుకుని వెళ్లిపోవచ్చు.లేదా తాము చదివిందానికి సంతృప్తిచెంది,ఇలాంటి ప్రదర్సనలను
ప్రోత్సహించాలనుకునే వాళ్లు తమకు తోచిన మొత్తాన్ని అక్కడున్న క్యాష్ బాక్సులో వేయవచ్చు.పుస్తక
ప్రియుల మీద నమ్మకంతోనే నిర్వహకులు ఉద్యోగాల పర్యవేక్షణలేని ఈ సరికొత్త ప్రయోగం చేసారట.వాళ్ల
నమ్మకమే నిజమై ఇప్పటివరకు ఒక్క పుస్తకం కూడా మాయం కాకపోవడమే కాకుండా ప్రదర్శన ఏర్పాటు చేయడానికి ఖర్చు పెట్టిన మొత్తం తిరిగి వచ్చేసిందటా.

0 comments :
Post a Comment