Breaking News
Loading...
Thursday, 9 July 2015

Leave letter for See The movie

www.bharatoffer.com
baahubali Emotional still

బాహుబలి చూడడానికి బాస్ కు గమ్మత్తైన లీవ్ లెటర్ రాసిన ఉద్యోగి !
గౌరవనీయులైన సీఈవో గారికి,
విషయం : విడుదల రోజు బాహుబలి సినిమా చూడడానికి శుక్రవారం సెలవు గురించి.
నేను మీ కంపెనీలో పనిచేసే సగటు ఉద్యోగిని. నాకు ఈ శుక్రవారం సెలవు కావాలి. ఎందుకంటే నా ఫ్యామిలీకి బాహుబలి సినిమా చూపించడం కోసం. సినిమా చూడడానికి సెలవెందుకు అని మీరడగవచ్చు. కానీ ఈ సినిమా చూపించకపోతే నా ఫ్యామిలీ నాకు దక్కేట్టు లేదు.
నా కొడుకు గడికోసారి నేనెవర్నీ…. నేనెవర్నీ… అని అరుస్తున్నాడు.
నా కూతురు జై మాయుష్మతీ అంటూ నిద్రలో కలవరిస్తుంది.
నా భార్య అయితే మాటిమాటికీ మాయిష్మతికి మకిలి పట్టిందీ…. రక్తంతో కడిగేయ్… అంటూ దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తుంది.
నాకేమో భల్లాల దేవ కల్లోకి వస్తున్నాడు… అప్పుడప్పుడు అవంతిక డ్రీమ్స్ లోకి వచ్చి టెంప్ట్ చేస్తుందనుకోండి (ఇది పర్సనల్)
నిన్న రాత్రి మా ముసలామె యాక్షన్, కెమెరా అంటూ ఆగమాగం చేసింది. ఓసేయ్ ముసలి ఏమయ్యిందే నీకు అంటే …అరెేయ్ నన్ను డిస్టర్బ్ జేయకు నేను రాజమౌళి ని అంటూ మల్లీ యాక్షన్, కెమెరా, స్టార్ట్ అంటుంది.
సార్ ఇక నా వల్ల కాదు….ఆ మోషన్ పిక్చర్ చూపించకపోతే మావాళ్లు నాకు మోషన్స్ తెప్పించేలా ఉన్నారు. మూడు సంవత్సరాలు సినిమా షూటింగ్ అయ్యేదాకా ఆగారు. కానీ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాక మూడు నిమిషాలు కూడా ఆగేలా లేరు నా ఫ్యామిలీ మెంబర్స్.
కాబట్టి పై విషయాలను దృష్టిలో ఉంచుకుని నాకు శుక్రవారం సెలవు ఇవ్వగలరని నా మనవి.
కృతజ్ఞతాభినందనలతో…
మీ విధేయుడు అమరేంద్ర బాహుబలి సినిమా సీను

0 comments :

Post a Comment

Back To Top